కేజ్రీవాల్ అరెస్టుపై.. మొన్న అమెరికా, నిన్న జర్మనీ, ఇప్పుడు ఏకంగా యూఎన్..

by Dishanational6 |
కేజ్రీవాల్ అరెస్టుపై.. మొన్న అమెరికా, నిన్న జర్మనీ, ఇప్పుడు ఏకంగా యూఎన్..
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతర్గత వ్యవహారాల్లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. ఇదివరకే కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. అది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయ్యింది.

భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెపాన్ డుజారిక్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టు, ఐటీ శాఖ చేసిన కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ తో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై మాట్లాడారు. భారత్ తో పాటు ఎన్నికలు జరిగే ప్రతి దేశంలోనూ రాజకీయ, పౌర హక్కులు రక్షిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నమ్ముతున్నామన్నారు.


Next Story

Most Viewed