Aadhaar Card Update:ఆధార్ కార్డు ఉన్నదా.. అయితే ఈ పనిచేయడి!

by samatah |
Aadhaar Card Update:ఆధార్ కార్డు ఉన్నదా.. అయితే ఈ పనిచేయడి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మానవ జీవితంలో ఆధార్ కార్డ్ కూడా భాగమైపోయింది. మనకు ఉన్న డాక్యుమెంట్లలో ఇదే ముఖ్యమైనది. ఏ చిన్న పని చేయాలన్న ఆధార్ కార్డ్ తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగ దరఖాస్తల కోసం ఇలా ఏ పని జరగాలన్న ఆధార్ కార్డే ముఖ్యం.

అయితే ఆధార్ కార్డుకు సంబంధించిన ఓ కీలక అప్డేట్‌ను అందించి ఆధార్ సంస్థ యూఐడీఏఐ. ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డును పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేయాలని కోరింది. సులభంగా సేవలు పొందడానికి, ప్రతి ఒక్కరు ఆధార్ బయోమెట్రిక్‌లను అప్డేట్ చేసుకోవాలని, దీని వలన తాజా వివరాలు అప్డేట్ అవుతాయని సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించి గత నెలలోనే ఆధార్ ధృవీకరణ పత్రాలకు సంబంధించిన అప్ డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది.

ఇక ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి అనుకునే వారు.. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్‌లో తమ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలను అప్డేట్ చేసుకోవచ్చని లేదా తమ వద్ద ఉన్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది.

Next Story

Most Viewed