కొత్తగా ప్రపంచంలోనే పొడవైన అనకొండను కనిపెట్టిన పరిశోధకులు(వీడియో)

by Disha Web Desk 17 |
కొత్తగా ప్రపంచంలోనే పొడవైన అనకొండను కనిపెట్టిన పరిశోధకులు(వీడియో)
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పామును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాహస యాత్రలో భాగంగా టీవీ వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ దీనిని కనుగొన్నారు. ఈ భారీ అనకొండ 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల బరువును కలిగి ఉంది. దీని తల మనిషి సైజులో ఉంటుంది. ఈ పాము జాతి ప్రపంచంలోనే అతి పెద్దది, బరువైన పాము అని ఆయన తెలిపారు. పరిశోధకులు కొత్త జాతికి లాటిన్ పేరు 'యునెక్టెస్ అకాయిమా' అని పెట్టారు, అంటే దీనర్థం ఉత్తర ఆకుపచ్చ అనకొండ. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ అనకొండలు తరచుగా వేగంగా కదులుతుంటాయి. వాటి శరీరం బలంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అమెజాన్ ప్రాంతం వాతావరణ మార్పు, నిరంతర అటవీ నిర్మూలన కారణంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ప్రొఫెసర్ వోంక్ అన్నారు. ఈ పాముల మనుగడ కోసం వాటి సహజ ఆవాసాలను కాపాడటంలో దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed