బెంగళూరులో ముగిసిన విపక్షాల సమావేశం

by Dishafeatures2 |
బెంగళూరులో ముగిసిన విపక్షాల సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజులుగా బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశం ముగిసింది. మొత్తం 26 పార్టీలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), డీఎంకే, టీఎంసీ వంటి పలు పార్టీలు ఈ రెండు రోజుల సమావేశానికి హాజరయ్యాయి. 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని గద్దె దించేందుకు విపక్షాలు ఏకమయ్యాయి.

ఈ క్రమంలోనే తమ కూటమికి ఇండియా (INDIA) అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కూటమికి ఇండియా (INDIA) అనే పేరును ఖరారు చేశారా అని కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బీహార్ సీఎం నితీశ్ ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని దాటవేశారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తాయని ఆయన తెలిపారు. కాగా విపక్షాలకు సంబంధించిన మొదటి సమావేశాన్ని బీహార్ లోని పాట్నాలో నిర్వహించారు.



Next Story

Most Viewed