బాలరాముని ప్రాణప్రతిష్టతో దేశమంతా ఆనందం..ఆ వ్యక్తి మాత్రం విషాదం..

by Disha Web Desk 3 |
బాలరాముని ప్రాణప్రతిష్టతో దేశమంతా ఆనందం..ఆ వ్యక్తి మాత్రం విషాదం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: 5 వందల సంవత్సరాల కల అయోధ్య రామ మందిరం. ఆ కల ఇన్నాళ్లకు తీరిందని.. ఆ దశరథ రాముడు బాల రామునిగా తిరిగి అయోధ్యకు చేరుకున్నారని.. దేశమంతా ఆనందంలో తెలియాడుతోంది. అయితే ఆ బాల రాముని విగ్రహాన్ని ముద్దముద్దుగా చెక్కిన శిల్పికి ఆ శిలను అందించిన వ్యక్తి మాత్రం కన్నీటి సాగరంలో మునిగిపోయారు.

వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ నటరాజ్ అనే వ్యక్తి స్థానికంగా క్వారీ కాంట్రాక్టర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడైన అరుణ్ యోగిరాజ్ అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించేందుకు బాల రాముని విగ్రహాన్ని తాయారు చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలుసుకున్న శ్రీనివాస్ నటరాజ్.. ఎలాగైనా అరుణ్ కు సాయం చెయ్యాలి అనుకుని తాను పని చేయిస్తున్న పొలంలో బయట పడిన ఒక కృష్ణ శిలను (నల్ల రాయి) అరుణ్ కి ఇచ్చారు.

కాగా అరుణ్ ఆ శిలను శిల్పంగా మార్చడం.. అయోధ్యలో ఆ అరుణ్ చేసిన విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అతి పురాతనమైన కృష్ణ శిలను అక్రమ మైనింగ్ ద్వారా వెలికి తీసిన నేపథ్యంలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ నటరాజ్ కు కర్ణాటక ప్రభుత్వం రూ/ 80 వేలు జరిమానా విడిదించింది.

ఈ నేపథ్యంలో బాధితుడు శ్రీనివాస్ నటరాజ్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి అక్రమ మైనింగ్ చెయ్యలేదని.. రామదాస్ అనే వ్యక్తి తన పొలంలో పైరు పండించేందుకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలిగించమని తనకు కాంట్రాక్టు ఇచ్చారని తెలిపారు. ఇక తాను కూడా ఆ కాంట్రాక్టును ఒప్పుకుని పొలంలో రాళ్లను తొలిగిస్తున్నప్పుడు తనకు ఆ రాయి కనిపించిందని.. దాన్ని తాను అరుణ్ కి అందించినట్లు పేర్కొన్నారు. అయితే అక్రమ మైనింగ్ అభియోగం మోపుతూ జియాలజీ శాఖ, కర్ణాటక పభుత్వం తనకి రూ/ 80 వేలు జరిమానా విధించిందని వాపోయారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును చెల్లించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed