ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. 4 శాతం డీఏ పెంపు

by Disha Web Desk 13 |
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. 4 శాతం డీఏ పెంపు
X

చెన్నై: ఉపాధ్యాయులు, పెన్షనర్లతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏ పెంచుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 38 నుంచి 42 శాతానికి పెంచినట్టు చెప్పింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యర్థలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పెంచిన డీఏను ఏప్రిల్ 1 నుంచి లెక్కగట్టి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఇది 16 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారికి లబ్ది చేకూర్చనుంది. డీఏ పెంచడంతో ప్రతి ఏడాది రూ.2367 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది.

ప్రభుత్వం తన ఉద్యోగుల కృషిని గుర్తించింది. సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాళ్ల పడ్డ కష్టాన్ని గమనించిన ప్రభుత్వం వారి హక్కుల రక్షణను కొనసాగించింది. గత పాలకులు ఆర్థిక సమస్యలు సృష్టించినప్పటికీ, కోవిడ్ ఫలితంగా ఆదాయం నష్టపోయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇక నుంచి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన వెంటనే రాష్ట్ర ఉద్యోగులకు కూడా పెంచుతామని ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read..

ఢిల్లీ గవర్నర్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ..


Next Story