త్రిపుర ఆదివాసీల డిమాండ్‌పై చర్చలు ప్రారంభం : ప్రద్యోత్ మాణిక్య

by Disha Web Desk 13 |
త్రిపుర ఆదివాసీల డిమాండ్‌పై చర్చలు ప్రారంభం : ప్రద్యోత్ మాణిక్య
X

అగర్తలా: తిప్రా మోథ పార్టీ అధ్యక్షుడు ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మా కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిపుర ఆదివాసీల రాజ్యాంగ పరిష్కార ప్రక్రియ ప్రారంభమైందని బుధవారం ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమన్వయ కర్తను నియమించేందుకు అంగీకరించారని తెలిపారు. అంతకుముందు బీజేపీ, తిప్రా మోథ పార్టీల సమావేశం పై కూటమి ఏర్పడుతుందనే అంతా భావించారు. అయితే ప్రభుత్వ కూటమిలో చేరేందుకు చర్చ జరగ లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా తమ డిమాండ్‌ను తీర్చేవరకు ప్రభుత్వంతో జట్టు కట్టమని తేల్చినట్లు పేర్కొన్నాయి. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్‌తో చర్చలు జరిపేందుకు సమన్వయకర్తను నియమించనున్నట్లు వెల్లడించాయి. త్రిపురలో తిప్రా మోథ్ర పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించింది.


Next Story

Most Viewed