మరో కఠిన శిక్షకు సిద్ధమైన తాలిబన్లు.. మహిళలను కొరడాలు, రాళ్లతోకొట్టి..

by Dishanational6 |
మరో కఠిన శిక్షకు సిద్ధమైన తాలిబన్లు.. మహిళలను కొరడాలు, రాళ్లతోకొట్టి..
X

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్గాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటుంన్నారు. ఇప్పుడు మరో కఠిన శిక్షను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వ్యభిచారానికి పాల్పడే మహిళల్ని బహిరంగంగా రాళ్లతో కొట్టి శిక్షించే శిక్షను అమలు చేయబోతున్నారు. తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లాహిబతుల్లా అఖుంద్ జాదా ఈ శిక్షను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలను రాళ్లతో కొట్టి చంపడం మానవహక్కుల ఉల్లంఘన అని తెలుస్తోంది అన్నారు. అయతే వ్యభిచారానికి సంబంధించిన శిక్షను త్వరలో అమలు చేస్తామన్నారు. మహిళలను బహిరంగంగా కొరడాలతో, రాళ్లతో కొట్టి చంపుతామన్నారు. రీసెంట్ లో అఫ్గాన్ కు చెందిన టీవీలో ఈ మెసేజ్ ని ప్రసారం చేశారు. కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో తాలిబాన్ పని ముగియలేదు.. అది ఇప్పుడే ప్రారంభమైందని అఖుంద్‌జాదా స్పష్టం చేశారు.

2021లో తాలిబాన్లు అఫ్గాన్ ప్రజాప్రభుత్వాన్ని దించేసి అధికారంలో వచ్చారు. అప్పటి నుంచి మహిళలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొటున్నారు. ఇప్పటికే బాలికలు సెకండరీ పాఠశాల విద్యను నిషేధించారు. అఫ్గాన్ మహిళ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లలో బాలిక ఆత్మహత్య రేటు పెరగడం.. అక్కడి విషాదకర పరిస్థితులను సూచిస్తుంది.


Next Story

Most Viewed