నీట్ ప్రవేశాల్లో ఓబీసీ కోటా సమర్థనీయమే: సుప్రీంకోర్టు

by Web Desk |
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ కోటా సమర్థనీయమే: సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: నీట్ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2021-22 కు గాను అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు ఓబీసీ కోటాలో 27 శాతం రిజర్వేషన్ సమర్థనీయమే అని పేర్కొంది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్ధిస్తున్నట్లు తెలిపింది. కేవలం స్కోరు మాత్రమే ప్రతిభకు కొలమానం కాదని వెల్లడించింది. 'పోటీ పరీక్షలు నిర్దిష్ట కాల వ్యవధిలో కొన్ని తరగతులకు లభించే ఆర్థిక సామాజిక ప్రయోజనాన్ని ప్రతిబింబించదు. మెరిట్ సామాజికంగా సందర్భోచితంగా ఉండాలి' అని వ్యాఖ్యానించింది.

దీనికి మెరిట్ రిజర్వేషన్లు అడ్డు కాకూడదని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2021–22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లపై స్టే ఇచ్చేది లేదని చెప్పింది. మహమ్మారి సమయంలో ఆసుపత్రుల్లో మరింత సంఖ్యలో డాక్టర్లు కావాలనే విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈ డబ్ల్యూ ఎస్)కు వార్షికాదాయం(రూ.8లక్షలు) ఈ విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపింది.



Next Story

Most Viewed