AP:బటన్ నొక్కి ఇచ్చిందెంత..తిన్నదెంత? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

by Disha Web Desk 18 |
AP:బటన్ నొక్కి ఇచ్చిందెంత..తిన్నదెంత? చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు మూడు రోజులే ఉండటంతో రాజకీయా వేడి రాజుకుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలతో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలుపు కూటమిదే అంటూ ప్రచారంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా టీడీపీ చీఫ్ ప్రజాగళం సభ నిర్వహిస్తున్న సంగతి తెలిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కురుపాంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియంను తీసుకొస్తే ఆపేశారని మండిపడ్డారు. ప్రతిసారి బటన్ నొక్కి డబ్బలు జమ చేస్తున్న అని చెబుతున్న సీఎం జగన్ గురించి వ్యాఖ్యనిస్తూ..బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత? జగన్ తిన్నదెంత అని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాత జగన్ ఓటు అడగాలి అని అన్నారు. నిత్యావసరాలు, పెట్రోలు ధరలు ఎందుకు పెంచారో చెప్పాలి? అన్నారు. ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. సీట్లు ఇచ్చారన్న కారణంతో ఈ ప్రాంతాన్ని దోచుకున్నా బొత్స పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Read More..

TDP: ‘వై నాట్ 175’గాలి కూటమి వైపు బలంగా వీస్తోంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు మాస్ ర్యాగింగ్



Next Story

Most Viewed