ప్రతి కుటుంబంలో మహిళకు రూ. లక్ష ఇస్తాం

by Disha Web Desk 15 |
ప్రతి కుటుంబంలో మహిళకు రూ. లక్ష ఇస్తాం
X

దిశ, మెదక్ ప్రతినిధి/ నర్సాపూర్ : దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రతి కుటుంబంలో మహిళ ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు కు మద్దతుగా నర్సాపూర్ లో గురువారం జన జాతర ప్రచార సభకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోని పేదలు, బలహీన వర్గాలు, రైతులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని భారత రాజ్యాంగం కపాడుతుందని, కానీ మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంకు ముందు ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావని, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి ఎంతో మంది మేథావులు కష్టపడి ఇచ్చిన రాజ్యాంగం నేడు సామాన్యుల గొంతుకగా మారిందన్నారు.

కానీ బీజేపీ అగ్రనేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని చె బుతున్నారని అన్నారు. సమూహాల ఇండియా కూటమి కలిసి రాజ్యాంగానికి రక్షణగా నిలుస్తామని తెలిపారు. దేశంలో వస్తున్న అన్ని సౌలభ్యాలు రాజ్యాంగం వల్లనే వస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. మోడీ పదేళ్ల కాలంలో పేదల సంక్షేమం కంటే 20-25 మంది ధనికుల ప్రయోజనం కోసమే పని చేశాడని అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారని, పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందిస్తున్నాడని విమర్శించారు. దీని మూలంగా రిజర్వేషన్ రద్దు చేసే యోచనలో ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ లు తీసివేసే కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే 50 శాతంకు పైగా రిజర్వేషన్ లు పెంచాలని చూస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కుల గణన ఎలా జరిగిందో అదే విధంగా దేశం అంతా కుల గణన చేస్తామని చెప్పారు. దళితులు, ఆదివాసీలు, అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ లు కల్పించే విధంగా చూస్తామని తెలిపారు.

దేశ సంపద రెండు శాతం మంది చేతుల్లో ఉందని, కుల గణన చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పదేళ్ల మోడీ పాలనలో ఎయిర్ పోర్ట్ కు, ఇతర పబ్లిక్ సెక్టార్ లు అదానీ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోటాను కోట్ల మందిని కోటేశ్వరులను చేసే అవకాశం ఉన్నా దేశంలో సంపద అంతా కేవలం 20 నుంచి 25 మంది చేతుల్లో ఉందన్నారు. ఒక చారిత్రాత్మక ప్రయత్నం చేస్తున్నామని, ఎవరు కలలో కూడా ఊహించని విధంగా వాస్తవ రూపం దాలుస్తామని తెలిపారు. ప్రపంచంలో ప్రతి దేశం కూడా మన దేశం చేసిందే చేస్తుందని, ఇందుకు కోసం మారుమూల ప్రాంతాల్లో పేదల జాబితా రూపొందిస్తామని, వీరిలో కర్షకులు, కార్మికులు, ఆదివాసులు ప్రతి కుటుంబం నుంచి మహిళను తీసుకుంటామని తెలిపారు. ప్రతి కుటుంబంలోని మహిళా బాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. దేశంలోని కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 8500 ఖాతాలో వేస్తామని తెలిపారు. ఒక్క దెబ్బతో దేశంలో పేదరికం నిర్మూలన జరుగుతుందని,

ఇచ్చే డబ్బుతో వైద్యం, విద్యా, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించారు. అలాగే దేశంలో ప్రజలు కొనే సరుకులు తయారు చేస్తారని, కంపెనీలు ఉత్పత్తి చేస్తే ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను ప్రారంభించి అక్కడితో ఆగకుండా ఉద్యోగాలు కూడా కల్పిస్తామని తెలిపారు. మోడీ అదానీ కోసమే నోట్ల రద్దు చేశాడని తెలిపారు. కొత్త పథకం పక్కాగా తెస్తామని, కొత్త ఉద్యోగం కూడా పక్కాగా ఇస్తామని అన్నారు. మోడీ 30 లక్షల ఉద్యోగాలు ఉన్నా ఇవ్వలేదని, రైతులను వేధించాడని పేర్కొన్నారు. కోటేశ్వరులకు రుణ మాఫీ చేసిన మోడీ రైతులకు మాత్రం చేయలేదన్నారు. కానీ తాము సంపూర్ణ రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. చట్ట పరిధిలో వరి, చెరుకు పంటలకు మద్దతు ధర తో పాటు ఆశ, అంగాన్ వాడీ మహిళకు సంపద రెట్టింపు చేస్తామని చెప్పారు. మోడీ ఎంత సొమ్ము సంపన్నులకు ఇచ్చాడో అంతే పేదలకు ఇస్తామని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15న రుణ మాఫీ చేస్తామని, పోడు భూములకు న్యాయం చేస్తామని చెప్పారు. ఢిల్లీ లో తెలంగాణ కోసం సియా సైనికుడిగా పని చేసి రాష్ట్రంకు అవసరమైన వాటిని అందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును బారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed