హిమాచల్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్: అనర్హతపై స్టేకు నిరాకరణ

by Dishanational2 |
హిమాచల్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్: అనర్హతపై స్టేకు నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారిపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. అంతేగాక అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ఓటింగ్‌లో పాల్గొడానికి కూడా అనుమతి నిరాకరించింది. అనర్హత వేటు వేయడానికి గల కారణాలను 14 రోజుల్లోగా తెలియజేయాలని హిమాచల్‌ అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్ సింగ్ పఠానియా, సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఐదు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. అంతేగాక రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టోలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయంపై స్టే విధించాలని కోరారు. దీనిపై సోమవారం న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పఠానియా నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. మరో వైపు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఈసీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌కు షెడ్యూల్ ప్రకటించింది. మే 7న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.



Next Story

Most Viewed