వేసవి ఎఫెక్ట్: కేజీ టమాటా ధర రూ.1,997 మాత్రమే!

by Disha Web Desk 6 |
వేసవి ఎఫెక్ట్: కేజీ టమాటా ధర రూ.1,997 మాత్రమే!
X

దిశ, వెబ్ డెస్క్: జనాలు విరివిగా వాడే కూరగాయల్లో టమాటా ఒకటి. ప్రతీ వంటకంలో కనీసం రెండు టమాటాలైనా కచ్చితంగా వాడతారు. కొంత మంది టమాటా లేకుండా కూరను వండరు. కాగా, బ్రిటన్‌లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది 5 పౌండ్లు ఉన్న ధర ప్రస్తుతం 20 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ. 1,997 ఉందట.

పిజ్జాకు సాస్ తయారీలో ఎక్కువగా టమాటాలను ఉపయోగించడం వల్ల పిజ్జా రేట్లను కూడా వ్యాపారులు పెంచారట. మరికొంత మంది అంత రేటు పెట్టి టమాటాలను కొనలేక కూరగాయలతో పిజ్జాలను తయారు చేసి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారట. బ్రిటన్‌లోనే కాకుండా భారత్ దేశంలోనూ టమాటా రేట్లు పెరిగాయి. టమాటాలకు కొనడానికి ప్రజలు రేటును చూసి కాస్త ఆలోచిస్తున్నారు.

Next Story

Most Viewed