ఒకేసారి 2 చేతులతో రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న స్కూల్ విద్యార్థులు (వీడియో)

by Dishanational1 |
ఒకేసారి 2 చేతులతో రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న స్కూల్ విద్యార్థులు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ సింగ్రౌలీలోని బుధేలాలో ఉన్న ఓ పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులు తమ స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా ఎన్డీటీవీలో వచ్చిన కథనం ప్రకారం.. ఈ స్కూల్ విద్యార్థులు ఒకేసారి తమ రెండు చేతులతో రాస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. అంతేకాదు.. అదనంగా వారు ఐదు భాషలలో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, ఉర్దూ మరియు స్పానిష్ భాషలలో కూడా వీరు ప్రావీణ్యం కలిగి ఉన్నారు. మొదటగా కుడి చేతితో, తర్వాత ఎడమ చేతితో... ఆ తర్వాత రెండు చేతులతో రాయడం నేర్చుకున్నామంటూ విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలను పెంపొందించడంలో మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ స్ఫూర్తి అంటూ పాఠశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్ తన రెండు చేతులను ఉపయోగించి రాసేవారని, దానిని స్ఫూర్తిగా తీసుకుని తమ పిల్లలకు కూడా అదే నైపుణ్యాన్ని నేర్చుకునేలా చేశామని ఆయన చెప్పారు. మొత్తం ఈ స్కూల్లో ఇప్పటివరకు 480 మంది విద్యార్థులు రెండు చేతులతో రాయడం నేర్చుకున్నారంట. అంతేకాదు.. వారి సాధారణ తరగతులతోపాటు విద్యార్థులకు ఒక గంట పాటు యోగా మరియు ధ్యానం కూడా నేర్పిస్తారంట.

Next Story