కాసేపట్లో ప్రధాని చేతికి భారత రాజ్యాంగం.. కొత్త పార్లమెంట్‌లో ఎంపీలు ముందు చేసేది ఇదే!

by Disha Web Desk 2 |
కాసేపట్లో ప్రధాని చేతికి భారత రాజ్యాంగం.. కొత్త పార్లమెంట్‌లో ఎంపీలు ముందు చేసేది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ ఉదయం 9.15 గంటలకు ఎంపీలందరి ఫోటో సెషన్ నడిచింది. అనంతరం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభల ఎంపీల సమావేశం ఉంటుంది. దీని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంట్‌కు వెళతారు. ఆ సమయంలో ప్రధాని రాజ్యాంగాన్ని చేతబట్టుకుంటారు. ఆయన వెనుక మిగిలిన ఎంపీలు ప్రధానిని అనుసరిస్తారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. 2.15 నిమిషాలకు రాజ్యసభ ప్రారంభం అవుతుంది.

కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త భవనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాన్ని.. ఈ ఏడాది మేలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 384 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు. ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూమ్‌లు, పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో కాగితరహిత కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

Read More..

మహిళా రిజర్వేషన్ బిల్లుపై BRS కీలక నేత షాకింగ్ కామెంట్స్


Next Story

Most Viewed