నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను.. రాయ్‌బరేలీ సభలో సోనియా గాంధీ ఉద్వేగ ప్రసంగం

by Ramesh N |
నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను.. రాయ్‌బరేలీ సభలో సోనియా గాంధీ ఉద్వేగ ప్రసంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబ సభ్యులని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటి సారి కుమారుడు రాహుల్‌కు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలీలోని శివాజీ నగర్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో బహిరంగ సభలో ఆమె ఉద్వేగ ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా సేవ చేసే అవకాశం ఇచ్చారని, రాయ్ బరేలీ, అమేథీలను ఎప్పటికీ మర్చిపోలేనని సోనియా గాంధీ అన్నారు. ఇక్కడి ప్రజలతో తనకు ఉన్న బంధం గంగామాత అంత పవిత్రమైనదన్నారు. పేదలకు సేవ చేయడమే తన పిల్లలకు నేర్పించానని చెప్పారు.

తనకు జీవితాంతం రాయ్ బరేలీ ప్రజల ఆశీర్వాదం అండగా ఉందన్నారు. నా తరపున రాహుల్ గాంధీ నిలబెడుతున్నాను.. నన్ను మీలో ఒకరిగా గుర్తించినట్లే రాహుల్ గాంధీని ఆదరించాలని ప్రజలను కోరారు. నా కొడుకు రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నాను.. రాయ్ బరేలీ వాసుల్ని రాహుల్ నిరాశపరచడని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాయ్‌బరేలీ ప్రజలతో తమ కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోడానికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ సభ్యత్యాన్ని, తన ఇంటిని తీసుకున్నారని గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థలు విచారించిన తాను బయ పడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచి బయటకు పంపినప్పుడు దేశ ప్రజలు తనకు అండగా నిలబడ్డారని చెప్పారు.

Next Story

Most Viewed