తెలుగులో అయోధ్య రాముడిపై పాట: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్వీట్ వైరల్

by Dishanational2 |
తెలుగులో అయోధ్య రాముడిపై పాట: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్వీట్ వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చక చకా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానాలు సైతం అందాయి. ఈ క్రమంలో తాజాగా అయోధ్య రాముడిపై తన తల్లి తెలుగులో పాడిన పాటను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దీనిపై స్పందించింది. ‘శ్రావ్యమైన సంగీత మేళవింపుతో కోదండ రామున్ని కీర్తిస్తూ పాడిన మీ అమ్మగారి గాత్రం ఆద్యంతం ఆధ్యాత్మిక భావనతో పులకింపజేసింది. జైశ్రీరామ్’ అని పేర్కొంది. ఈ ట్వీట్ తెలుగులో చేయడం గమనార్హం. మరోవైపు గుజరాతీ గాయని గీతాబెన్ రాబరీ పాడిన ‘శ్రీరామ్ ఘర్ ఆయే’ పాటను ప్రధాని ప్రశంసించారు. ‘అయోధ్యలోని శ్రీరాముని దివ్య మందిరంలో రామ్ లల్లా రాక కోసం దేశవ్యాప్తంగా నా కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతాబెన్ రాబరీ తన పాటతో రాముడిని స్వాగతిస్తున్న ఈ భజన చాలా భావోద్వేగంగా ఉంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



Next Story

Most Viewed