షాకింగ్ న్యూస్.. భారత్‌లో తగ్గిపోతున్న యూత్

by Disha Web Desk 18 |
షాకింగ్ న్యూస్.. భారత్‌లో తగ్గిపోతున్న యూత్
X

దిశ,వెబ్ డెస్క్:యాభై శాతం యువ జనాభా కలిగి ఉన్న భారత్ యంగ్ ఇండియా గా పేరొందిన విషయం తెలిసిందే.ప్రపంచంలో అధిక యువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.అంతర్జాతీయ నివేదిక ఏం చెబుతుందంటే.. రానురాను ఇండియాలో యువత తగ్గిపోనుందట. దేశ అభివృద్ధిలో కీలకమైన యంగ్ పాపులేషన్ సౌత్ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తెలిపింది.దేశం అభివృద్ధి పథంలో ముందులంటే యువతతోనే సాధ్యం అవుతుంది.కానీ రానున్న రోజుల్లో యువత తగ్గిపోవడం వల్ల అభివృద్ధి అంతగా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు.

ఎందుకంటే విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ఈ రాష్ట్రాల్లో భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదు. ILO ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌తో కలిసి ‘భారత ఉపాధి నివేదిక-2024’ను తాజాగా విడుదల చేసింది. 2039 నాటికి తెలంగాణలో 15-29 ఏళ్ల యువ జనాభా తగ్గనుందని తేల్చి చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ తగ్గుదల ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరగనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed