రాహుల్ గాంధీకి షాక్!: బటద్రవ థాన్‌కు అనుమతి నిరాకరణ

by Dishanational2 |
రాహుల్ గాంధీకి షాక్!: బటద్రవ థాన్‌కు అనుమతి నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అసోంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో సంఘ సంస్కర్త అయిన శంకర్‌దేవా జన్మస్థలం బటద్రవ థాన్‌ను సోమవారం రాహుల్ సందర్శించాల్సి ఉంది. అయితే బటద్రవకు వెళ్లకుండా ఆలయ నిర్వాహకులు రాహుల్ గాంధీని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రాహుల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్‌గా మారింది. రాహుల్‌ని మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రాంగణంలోకి అనుమతిస్తామని బటద్రవ థాన్ మేనేజ్‌మెంట్ కమిటీ తెలిపింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ..‘జవవరి 11నే బటద్రవ థాన్ మేనేజ్‌మెంట్ కమిటీ అనుమతి కోరాం. 22వ తేదీ ఉదయం 7గంటలకు రాహుల్ వస్తారని చెప్పాం. అప్పుడు వారు స్వాగతం పలుకుతామని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల ప్రస్తుతం అనుమతి నిరాకరించారు. ఇది సరైన పద్దతి కాదు’ అని తెలిపారు. కాగా, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత బటద్రవను సందర్శించాలని అసోం హిమంత బిస్వ శర్మ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బటద్రవకు వెళ్లకుండా రాహుల్‌ను అడ్డుకోవడం గమనార్హం.

Next Story

Most Viewed