ఆధార్ కార్డు ఫోటో కాపీని షేర్ చేస్తున్నారా..? చాలా డేంజర్..

by Disha Web Desk 12 |
ఆధార్ కార్డు ఫోటో కాపీని షేర్ చేస్తున్నారా..? చాలా డేంజర్..
X

దిశ, వెబ్ డెస్క్: ఆధార్ కార్డుల వినియోగం పై ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలను ప్రకటించింది. ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫోటో కాపీని ఇతరులకు లేదా, సంస్థలకు షేర్ చేయవద్దని తెలిపింది. అలా చేయడం మంచిది కాదని.. దాని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా ప్రజలు తప్పకుండా ఆధార్ మాస్క్ కాపీలను ఉపయోగించాలని ప్రజలను కోరింది. UIDAI నుండి వినియోగదారు లైసెన్స్ పొందిన సంస్థలు ఒక వ్యక్తి యొక్క గుర్తింపును స్థాపించడానికి ఆధార్‌ను ఉపయోగించవచ్చని పేర్కొంది. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం వల్ల మన ఐడెంటిటి కి ఎటువంటి ప్రమాదం వాటిల్లే పరిస్థితి రాదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Next Story

Most Viewed