సీఎం కేసీఆర్ కాన్వాయ్ పై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ కాన్వాయ్ పై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం దాదాపు 600 వాహన శ్రేణితో షోలాపూర్ కు బయలుదేరారు. ఆ కాన్వాయ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో కూడిన భారీ సైన్యం కేసీర్ తో ఉంది. తన పర్యటనలో భాగంగా పండర్‌పూర్ పట్టణంలోని విఠలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ తనదైన శైలిలో స్సందించారు. ఓ వ్యక్తి తన బలాన్ని చూపించడానికి చేసే ప్రయత్నం ఆందోళనకరమని అన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దైవ దర్శనానికి వస్తే.. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని, కానీ భారీ కాన్వాయ్ తో బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం తనకు ఆందోళన కలిగించిందన్నారు.

సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ పై పెట్టిన దృష్టి రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై పెడితే బాగుండేదని పవార్ చురకలంటించారు. 2021 పంఢర్‌పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్‌సీపీ నుంచి పోటీ చేసి విఫలమైన భగీరథ్ భాల్కే మంగళవారం ర్యాలీలో బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో స్పందించిన శరద్ పవార్ ఓ వ్యక్తి పార్టీని విడిచి పెడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భగీరథ భాల్కేకు టికెట్ ఇచ్చిన తర్వాత మా ఎంపిక తప్పని గ్రహించామని, అయితే, దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని ప్రస్తావించారు.

Next Story

Most Viewed