వామపక్షాల కంటే మమతా బెనర్జీ పాలన అధ్వాన్నం.. రవిశంకర్ ప్రసాద్

by Dishafeatures2 |
వామపక్షాల కంటే మమతా బెనర్జీ పాలన అధ్వాన్నం.. రవిశంకర్ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బెంగాల్ లో చెలరేగిన హింసపై బీజేపీ ఓ నిజనిర్ధారణ బృందాన్ని అక్కడికి పంపించింది. ఈ సందర్భంగా బృందం చైర్మన్ గా ఉన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. బెంగాల్ లో లెఫ్ట్ పాలన కంటే మమతా బెనర్జీ పాలన మరీ అధ్వాన్నంగా ఉందని అన్నారు.. తన పాలనలో మునుపెన్నడూ లేని విధంగా బెంగాల్ లో హింస ఎందుకు పెరిగిందో మమత చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగాల్ లో జరిగే ప్రతి ఎన్నికలో కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరారు. మమత ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు.

యూపీలో ఫుల్ మెజారిటీతో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ఆయన.. ఏనాడు టీఎంసీ ప్రభుత్వం లాగా తాము హింసకు పాల్పడలేదని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులు టీఎంసీలో చేరకుంటే గెలిచినట్లు సర్టిఫికేట్లు ఇవ్వబోమంటూ మమతా ప్రభుత్వం బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం.. మీడియాతో ప్రత్యక్షంగా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మమతా ఓ పోరాట యోధురాలు అని ప్రశంసించిన ఆయన.. బెంగాల్ లో హింసను ఎందుకు అరికట్టలేకపోతున్నారని దీదీని నిలదీశారు.


Next Story