BREAKING : ఎన్నికల బాండ్ల ‘నంబర్లూ’ వెల్లడించిన ఎస్‌బీఐ

by Dishanational4 |
BREAKING : ఎన్నికల బాండ్ల ‘నంబర్లూ’ వెల్లడించిన ఎస్‌బీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు సహా అన్ని వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) సమర్పించింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ గురువారం సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఎన్నికల బాండ్ల అన్ని వివరాలను మార్చి 21న భారత ఎన్నికల కమిషన్‌కు అందించింది’’ అని అఫిడవిట్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా పేర్కొన్నారు. ఎస్‌బీఐ బహిర్గతం చేసిన ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘం త్వరలో తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది. ఇంతకుముందు ఎస్‌బీఐ విడుదల చేసిన ఎన్నికల బాండ్ల జాబితాలో ఏయే కంపెనీ ఎన్ని విరాళాలు ఇచ్చింది ? ఏయే పార్టీ ఎన్ని విరాళాలు పొందింది ? అనే ఇన్ఫో మాత్రమే ఉంది. వాటిలో ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు లేకపోవడంతో ఏ కంపెనీ నుంచి ఏ పార్టీకి ఎంతమేర విరాళాలు అందాయనే దానిపై క్లారిటీ రాలేదు. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకుగానూ ఈ సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని మార్చి 18న ఎస్‌బీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 21లోగా ఆ వివరాలను ఈసీకి అందించి, తమ ఆదేశాల అమలుపై అఫిడవిట్‌ను అందించాలని బ్యాంకుకు నిర్దేశించింది.


Next Story