టికెట్ కోసం గోడవ.. మహిళపై ఆర్టీసీ కండక్టర్ దాడి (వీడియో వైరల్)

by Disha Web Desk 5 |
టికెట్ కోసం గోడవ.. మహిళపై ఆర్టీసీ కండక్టర్ దాడి (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళపై బస్సు కండక్టర్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. కర్నాటకకు చెందిన ఆర్టీసీ కండక్టర్ కు, మహిళా ప్రయాణికురాలుకు బస్సు టికెట్ విషయంలో గొడవ మొదలయ్యింది. బస్సు నడుస్తుండగా వివాదం ముదిరింది. ఈ విషయంలో సహనం కోల్పోయిన మహిళ బస్సు కండక్టర్ పై చెయ్యి చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పక్కనే ఉన్నా వ్యక్తులు ఆపే ప్రయత్నం చేసిన వినకుండా మహిళను బస్సులోనే కిందపడేసి దారుణంగా కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, ఇద్దరిది తప్పు ఉన్నా.. కండక్టర్ అంతలా దాడికి దిగడం సరికాదని, కండక్టర్ పై తగిన చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed