కాంగ్రెస్ కు షాక్ ల మీది షాక్ లు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ.. ఐటీ నోటీసులు

by Dishanational6 |
కాంగ్రెస్ కు షాక్ ల మీది షాక్ లు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ.. ఐటీ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థనపై విచారణకు తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. అది జరిగిన కొన్నిగంటలకే ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ దాదాపు రూ.1,700 కోట్లు చెల్లించాలని నోటీసులిచ్చింది. దీంతో హస్తం పార్టీని ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి.

మరోవైపు 2017-18 నుండి 2020-21 వరకు వివరాలు ఇవ్వాలని కోరింది ఆదాయపు పన్ను శాఖ. ఇందులో పెనాల్టీ, వడ్డీ రెండూ ఉన్నాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ 2021-22 నుండి 2024-25 వరకు ట్యాక్స్ రీ అసెస్ మెంట్ కోసం వేచి ఉంది. దీని కటాఫ్ తేదీ ఈనెల 29తో పూర్తవుతుంది. ఐటీ నోటీసులు వచ్చినట్లు కాంగ్రెస్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా ధ్రువీకరించారు. ఆదాయపు పన్ను శాఖ చర్యలు అప్రజాస్వామికమని, అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు నాలుగేళ్ల పాటు పన్ను అధికారులు తమపై పన్ను రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఆ పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. మరో ఏడాది పాటు రీవాల్యుయేషన్‌ను ప్రవేశపెట్టడంలో జోక్యం చేసుకోకూడదని.. గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం పిటిషన్‌లను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత విషయం 2017 నుంచి 2021 వరకు అంచనాకు సంబంధించినదని పేర్కొంది.


Next Story

Most Viewed