అకోలా, షెవ్‌గావ్ రెండు వర్గాల మధ్య అల్లర్లు.. ఇంటర్నెట్ షట్‌డౌన్

by Disha Web Desk 12 |
అకోలా, షెవ్‌గావ్ రెండు వర్గాల మధ్య అల్లర్లు.. ఇంటర్నెట్ షట్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోలా, షెవ్‌గావ్‌లో రెండు వర్గాల మధ్య జరిగి గొడవలు కాస్తా.. మతపరమైన హింసలకు దారి తీసింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి.. ఇంటర్నేట్‌ను తాత్కలికంగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. ఆ రెండు ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించామని పోలీస్ అధికారులు తెలిపారు. అలాగే. రాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరీష్ మహాజన్ స్వయంగా అకోలాను సందర్శించగా, రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ షెగావ్‌లో పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కొందరు వ్యక్తులు, సంస్థలు కోరుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం వాటిని బహిర్గతం చేస్తుంది. అలాగే అలాంటి వారికి తగిన గుణపాఠం కూడా నేర్పుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఒక ప్రకటనలో తెలిపింది.


Next Story