జెండాపై రాహుల్ ఫొటో.. క్షమాపణలు చెప్పాలని కన్నడ సంఘాల డిమాండ్..

by Dishanational4 |
జెండాపై రాహుల్ ఫొటో.. క్షమాపణలు చెప్పాలని కన్నడ సంఘాల డిమాండ్..
X

బెంగళూరు: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటక జెండాను పోలిన పతాకంపై రాహుల్ ఫోటో ఉండడం వివాదంగా మారింది. ఆదివారం ర్యాలీలో ఓ కార్యకర్త చేపట్టిన జెండా అచ్చు అలాగే ఉండడంతో కన్నడ సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేశాయి. వెంటనే ఆ జెండాను తొలగించాలని కర్ణాటక నవ నిర్మాణ సమితి డిమాండ్ చేసింది. బేషరతుగా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని కోరాయి. దీనిపై కర్ణాటక బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

కన్నడ జెండాపై రాహుల్ ఫోటో ఉండటాన్ని ఖండించారు. సిద్దరామయ్య అధికారంలో ఉన్నప్పుడు జెండాను మారిస్తే నిరసనలు చోటుచేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ ఫోటోను ఉపయోగించడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు కర్ణాటక జెండాను గుర్తించాలన్న ప్రతిపాదనను బీజేపీ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కర్ణాటక అనధికార జెండా ఎరుపు, పసుపు వర్ణాలతో ఉంటుంది. ఇదే తరహాలో ఉన్న జెండాపై రాహుల్ ఫోటో ఉండడం చర్చకు దారి తీసింది. మరోవైపు భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మైసూర్ చేరుకున్నారు. గురువారం నుంచి ఆమె యాత్రలో పాల్గొనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed