రష్యా భారత్‌ల మధ్య సానుకూల సంబంధాలు: విదేశాంగ మంత్రి జైశంకర్

by Dishanational2 |
రష్యా భారత్‌ల మధ్య సానుకూల సంబంధాలు: విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-రష్యా సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని తెలిపారు. భవిష్యత్‌పై ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉందని కొనియాడారు. భారత్ రష్యాతో సానుకూల సంబంధాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడి భారతీయులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ రష్యా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు. ఇరు దేశాలు ఒకరి ప్రయోజనాలను మరొకరు చూసుకున్నాయని గుర్తు చేశారు. రష్యా భారత్‌కు ఎన్నడూ హానీచేయలేదని తెలిపారు. రెండు దేశాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

భారత్-సింగపూర్ సంబంధాలపై కూడా జైశంకర్ స్పందించారు. ఇరు దేశాల సంబంధాల్లో వ్యక్తిగతంగా పాలుపంచుకోవడం సంతోషకరమని తెలిపారు. రెండు దేశాల మధ్య రిలేషన్ షిప్స్ ఇటీవల మరింత దగ్గరయ్యాయని వెల్లడించారు. భారతదేశం గ్లోబలైజ్ అయినందున భారత్, సింగపూర్ మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసిందన్నారు. కాగా, జైశంకర్ ప్రస్తుతం సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియాల అధికారిక పర్యటనలో ఉన్నారు.

Next Story

Most Viewed