Venkaiah Naidu: వెంకయ్య నాయుడికి ప్రధాని మోడీ వీడ్కోలు

by Disha Web Desk 4 |
PM Modi Lauds Outgoing Vice President Venkaiah Naidu
X

దిశ, డైనమిక్ బ్యూరో: PM Modi Lauds Outgoing Vice President Venkaiah Naidu| సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు రాజ్యసభ సభ్యులు వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న వెంకయ్య నాయుడికి నేడు పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం అని, వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడి అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.

భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని, చైర్మన్‌ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలని ప్రధాని ప్రసంగించారు. అనంతరం, వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా వీడ్కోలు ప్రసంగాలు చేశారు.

అంతే కాకుండా సోమవారం సాయంత్రం జిఎంసి బాలయోగి ఆడిటోరియంలో వెంకయ్యనాయుడుకు మరో వీడ్కోలు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అయితే, భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. అయితే, పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం సెషన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్కర్‌కు అభినందనలు..


Next Story

Most Viewed