ఖర్గె వ్యాఖ్యలు తుక్డె-తుక్డె గ్యాంగ్ తరహాలో ఉన్నాయి: ప్రధాని మోడీ

by Dishanational1 |
ఖర్గె వ్యాఖ్యలు తుక్డె-తుక్డె గ్యాంగ్ తరహాలో ఉన్నాయి: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ, ఖర్గె వ్యాఖ్యలు దేశాన్ని విభజించాలనే మనస్త్వత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. 'కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి అంటే చిన్న విషయం కాదు.. ఆర్టికల్ 370కి రాజస్థాన్‌తో సంబంధం లేదని ఆ నాయకుడు భావిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగం కాదా? ఆయన ఆలోచన తుక్డె-తుక్డె ఆలోచనాధోరణికి అద్దం పడుతోందని ' పేర్కొన్నారు. రాజస్థాన్, బీహార్‌తో సహా దేశం నలుమూలల నుంచి భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారని మోడీ పేర్కొన్నారు. ఇండియా కూటమి రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. బాబా సాహెబ్ అంబేద్కర్ విధానాన్ని జమ్మూకశ్మీర్‌లో ఎందుకు పూర్తిగా అమలు చేయలేకపోయారో వారు చెప్పాలి. మరోవైపు, కశ్మీర్‌తో సంబంధం ఏంటీ అని కాంగ్రెస్ పార్టీ అడగటం సిగ్గుచేటని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కాంగ్రెస్ అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అక్కడి ప్రజలకూ మిగిలిన దేశంలోని వారి ఉన్న హక్కులే ఉంటాయి. జమ్మూకశ్మీర్‌పై ప్రతి రాష్ట్రం, పౌరుడికి హక్కు ఉందని కాంగ్రెస్‌కు గుర్తు చేస్తున్నామని వెల్లడించారు.



Next Story

Most Viewed