100+ వయస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. వారెవరో తెలుసా ?

by Disha Web Desk 20 |
100+ వయస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. వారెవరో తెలుసా ?
X

దిశ, ఫీచర్స్ : గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం ఈ ఏడాది 132 పద్శశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ గౌరవాన్ని అందుకునేందుకు ఎంపికయ్యారు. వారితో ముగ్గురు అవార్డు గ్రహీతలు 100 ఏండ్లక పైబడిన వారు ఉన్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన యోగా టీచర్ - షార్లెట్ చోపిన్ ( 100 )

గత ఏడాది బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పారిస్‌లో షార్లెట్ చోపిన్‌ను కలిశారు. షార్లెట్ చోపిన్ ఫ్రాన్స్‌లో యోగా విప్లవాన్ని తీసుకువచ్చారు. ఆమె 50 సంవత్సరాల వయస్సులో యోగా చేయడం ప్రారంభించారు. షార్లెట్ చోపిన్ 1982లో ఫ్రాన్స్‌లో యోగాను బోధించడం ప్రారంభించారు. రానురాను ఆమెకు ప్రజాదరణ పెద్ద సంఖ్యలో పెరిగింది. ఫిట్‌నెస్, మానసిక ప్రశాంతతను కోరుకునే వారి కోసం ఫ్రెంచ్ దేశంలో యోగా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ రోజు వరకు 100 సంవత్సరాల వయస్సు గల ఆమె పారిస్‌లో యోగా నేర్పుతుంది.

ఒడిశా - కృష్ణ లీలా గాయకుడు గోపీనాథ్ స్వైన్ (105 )

గోపీనాథ్ స్వైన్‌ విశిష్ట సేవకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఆయన గంజాంకి చెందిన కృష్ణ లీలా గాయకుడని, ఈ కళను సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దఖింశ్రీ, చింతా, దేశాఖ్య, తోడి భటియారి, భటియారి, కుంభ కమోడితో సహా 5 పురాతన రాగాలను పాడడం మాత్రమే కాదు నేర్పించారు కూడా. పాఠశాలలను స్థాపించి తన కళను వందలాది మంది యువతకు నేర్పించారు. విశేషమేమిటంటే, అతను కేవలం 5 సంవత్సరాల వయస్సులో తన సంగీత సాధన ప్రారంభించాడు.

కేరళకు చెందిన విద్యావేత్త - పకరవుర్ చిత్రన్ నంబూద్రిపాద్ (102) మరణానంతరం అవార్డు పొందారు.

పి. చిత్రన్ నంబూద్రిపాద్ ఒక రచయిత, విద్యావేత్త. కేరళకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త. ఆయన బతికున్న కాలంలో ఎన్నో జాతీయ అవార్డులను గెలుచుకున్న విద్యావేత్త. అంతే కాదు ఆయన తన 99 సంవత్సరాల వయస్సులో కూడా 29వ సారి హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన పర్వత ( ఉక్కు) మనిషి. ప్రస్తుతం ఆయన వయస్సు (102) కానీ ఈ అవార్డును ఆయన మరణాంతరం ప్రకటించారు.

Next Story

Most Viewed