మా క్షిపణులను కూల్చేస్తే సహించేది లేదు.. అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక

by Disha Web Desk 13 |
మా క్షిపణులను కూల్చేస్తే సహించేది లేదు.. అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక
X

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అమెరికాకు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి సంబంధించిన క్షిపణులను కూల్చేస్తే సహించేది లేదని పేర్కొంది. అలా చేస్తే యుద్ధంగా భావిస్తామని తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాల నడుమ ఉత్తర కొరియా మీడియా ప్రకటన చేసింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి ఈ హెచ్చరికలు చేసినట్లు తెలిపింది.

ఉత్తరాది పసిఫిక్ మహాసముద్రంలోకి మరిన్ని క్షిపణులను ప్రయోగిస్తామని ఆమె చెప్పారని పేర్కొంది. యూఎస్ దాని మిత్ర దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధించబడిన ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను ఎప్పుడూ కూల్చలేదని పేర్కొంది. పసిఫిక్‌లో యూఎస్, జపాన్ ఆధిపత్యం నడవదని ఆమె అన్నారన్నారు. ఓ వైపు ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం ఆందోళనల మధ్య యూఎస్-దక్షిణ కొరియా లు వరుసగా విన్యాసాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


Next Story