Nitish Kumar : నితీష్ సర్కారుకు ఎదురుదెబ్బ

by Dishafeatures2 |
Nitish Kumar : నితీష్ సర్కారుకు ఎదురుదెబ్బ
X

పాట్నా: బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఎదురు దెబ్బ తగిలింది. బీహార్ లోని నితీష్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ‘హిందుస్థానీ అవామీ మోర్చా’ పార్టీ అధినేత సంతోష్ కుమార్ సుమన్ మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. తమ పార్టీని జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో విలీనం చేయాలని నితీష్ కుమార్ ఒత్తిడి చేస్తున్నారని, తన పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లిందని, దాన్ని కాపాడుకునేందుకే రాజీనామా చేశానని సుమన్ చెప్పారు. సుమన్ తన రాజీనామా లేఖను బీహార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, నితీష్ కుమార్ అనుచరుడు విజయ్ కుమార్ చౌదరికి అందించారు.

ఈ నెల 23వ తేదీన పాట్నాలో జరిగే బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కూడా తమ పార్టీని ఆహ్వానించలేదన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడం గురించి ఆలోచించడం లేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహా ఘట్ బంధన్ తోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝూ కుమారుడైన సుమన్ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. తేజస్వి యాదవ్ కు చెందిన ఆర్జేడీకి మిత్రపక్షమైన హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంది.

Next Story

Most Viewed