కర్ణాటక కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్! బీజేపీకి కలిసి రానుందా..?

by Disha Web Desk 4 |
కర్ణాటక కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్! బీజేపీకి కలిసి రానుందా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఎన్నికలకు మరో కొన్ని వారాలు మాత్రమే గడువు ఉండటంతో పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తన రాజీనామాలు చేయడం కన్నడనాట ఆసక్తిగా మారింది. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఉండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానం టికెట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే పార్టీకి రాజీనామా చేసిన వారిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు హస్తం పార్టీలో అలజడి రేగుతోంది.

కాంగ్రెస్‌కు కలిసి వచ్చేనా..?

బీజేపీ మాజీ నేత, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది నేడు కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో కన్ఫర్మ్ చేశాడు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో లక్ష్మణ్‌కు టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు. మరి కొంత మంది టికెట్ రాని నేతలు కూడా అదే బాటలో పయణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ సింగిల్ లార్జ్ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు అవినీతి ప్రభుత్వం అంటూ ఏ పార్టీపై అయితే విమర్శలు గుప్పించారో ఆ పార్టీ నుంచి వచ్చిన నేతలను కాంగ్రెస్ ఆదరిస్తే అంతిమంగా కాంగ్రెస్‌కు దెబ్బ తగలడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆయుధంగా బీజేపీ అవినీతి అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తోంది. 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని ఎత్తి చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు బీజేపీలో కొనసాగిన నేతలు సడెన్‌గా కాంగ్రెస్‌లో చేరితే ప్రజల్లోకి ఇది తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయని అందువల్ల బీజేపీ నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు లాభం కంటే నష్టమే అనే చర్చ జరుగుతోంది.

ఇదంతా బీజేపీ ప్లాన్‌లో భాగమేనా..?

సౌత్ ఇండియాలో బీజేపీకి గేట్ వే గా ఉన్న కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ అధిష్టానం ఉంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు తరచూ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో అవినీతి ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా సిట్టింగ్ లను పక్కన పెట్టి పెద్ద ఎత్తున కొత్త వారికి టికెట్లు కేటాయించింది బీజేపీ.

దీంతో టికెట్లు దక్కని నేతల్లో మెజార్టీ శాతం ఇతర పార్టీలో చేరడం అనివార్యం అవుతోంది. దీంతో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్, జేడీఎస్ లో చేరితో ఇన్నాళ్లు అవినీతి చేసిన నేతలను ఎందుకు చేర్చుకున్నారనే విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కమలనాథులు అంచనా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ పరిణామం అంతిమంగా బీజేపీకే లాభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ వార్నింగ్‌తోనే అంబేడ్కర్ విగ్రహం పూర్తి.. : బండి సంజయ్

Next Story

Most Viewed