రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. గర్వంగా ఉందంటూ పీటీ ఉష ట్వీట్

by Disha Web Desk 19 |
రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. గర్వంగా ఉందంటూ పీటీ ఉష ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్య స‌భ‌లో నేడు అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పరుగల రాణి, ఎంపీ పీటీ ఉష కాసేపు రాజ్యస‌భ చైర్మన్ చైర్‌లో కూర్చుని స‌భా కార్యకలాపాలను న‌డిపించారు. రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లేని సమయంలో వైస్‌ ఛైర్‌పర్సన్స్‌ కమిటీలోని సభ్యులు ఎవరో ఒకరు సభా అధ్యక్ష బాధ్యతలు చూస్తారు. అయితే, చైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ స‌భ‌లో లేని స‌మ‌యంలో.. ప‌య్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పీటీ ఉష స‌భా కార్యక్రమాల‌ను పర్యవేక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పీటీ ఉష ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

'ప్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ చెప్పిన విధంగా.. గొప్పస్థానం ఇంకా గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది. రాజ్యసభ సెషన్‌ను నిర్వహిస్తున్నప్పుడు నాకు అలాంటి భావనే కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ ప్రయాణంలో మరింత పరిణితి సాధిస్తాను' అని బాధ్యతలు నిర్వహిస్తోన్న వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు 'గర్వంగా ఉంది ఉష. నువ్వు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరోసారి చరిత్ర సృష్టించు. నువ్వు మహిళలందరికీ స్ఫూర్తి' అంటూ కామెంట్లలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గతేడాది బీజేపీ పార్టీ తరపున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed