బ్రేకింగ్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తేదీలు ఫిక్స్.. ఎప్పటినుంచంటే...?

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తేదీలు ఫిక్స్.. ఎప్పటినుంచంటే...?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 17 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి అన్ని పార్టీలు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి కోరారు. కొత్త పార్లమెంట్‌లో జరగబోయే తొలి సమావేశాలు ఇవే కావడం గమనార్హం. కాగా యూసీసీపై కొంత కాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో బిల్లును తీసుకురాబోతున్నదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కేంద్రం ఆలోచన ఏవిధంగా ఉందనేది ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed