‘‘సీఏఏ మా అంతర్గత వ్యవహారం.. మీకేం పని ?’’ : అమెరికాకు భారత్ పంచ్

by Dishanational4 |
‘‘సీఏఏ మా అంతర్గత వ్యవహారం.. మీకేం పని ?’’ : అమెరికాకు భారత్ పంచ్
X

దిశ, నేషనల్ బ్యూరో : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు భారత్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌పై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలను సమానంగా చూడటం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ భారత్‌కు హితవు పలికారు. ఓ ఇంటర్వ్యూలో మిల్లర్ చేసిన ఈ వ్యాఖ్యలకు భారత్ బలంగా కౌంటర్ ఇచ్చింది. ‘‘మిల్లర్ వ్యాఖ్యలు కల్పితమైనవి.. అనవసరమైనవి’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు. ‘‘సీఏఏ అనేది కొత్తగా పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించినది. ఎవరి నుంచీ పౌరసత్వాన్ని లాక్కునేది కాదు. తనకంటూ ఒక దేశం లేని వ్యక్తి సమస్యను ఇది పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. ప్రజలకు మర్యాదపూర్వకమైన జీవితాన్ని అందిస్తుంది. సీఏఏ చట్టం ఒక దేశ అంతర్గత వ్యవహారం. భారత దేశ సమ్మిళిత సంప్రదాయాలకు, మానవ హక్కుల పరిరక్షణకు అనుగుణంగా ఉంది’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు సురక్షిత ప్రదేశాన్ని సీఏఏ అందిస్తుంది’’ అని రణధీర్‌ జైస్వాల్ చెప్పారు.


Next Story

Most Viewed