కశ్మీర్‌లో పుట్టాడు.. పీఓకేలో ఉగ్రమూకలా వెళ్లాలనుకున్నాడు.. మహ్మద్ ఖాసిం ఎవరు ?

by Dishanational4 |
కశ్మీర్‌లో పుట్టాడు.. పీఓకేలో ఉగ్రమూకలా వెళ్లాలనుకున్నాడు.. మహ్మద్ ఖాసిం ఎవరు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే) కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తైబా సభ్యుడు మహ్మద్ ఖాసిం గుజ్జర్‌ను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం- 1967 ప్రకారం అతడిని టెర్రరిస్టుగా గుర్తించామని వెల్లడించింది. జమ్మూలోని రియాసి జిల్లా అంగ్రాలాకు చెందిన 32 ఏళ్ల మహ్మద్ ఖాసిం భారత్‌పై యుద్ధం చేయాలనే దురుద్దేశంతో లష్కరే తైబా ఉగ్ర సంస్థతో చేతులు కలిపాడని పేర్కొంది. ఈమేరకు కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ), నగదు వంటి వాటిని డ్రోన్ల ద్వారా కశ్మీర్‌కు తరలించడంలో పాక్ ఉగ్ర సంస్థలకు మహ్మద్ ఖాసిం సాయం చేస్తున్నాడని వెల్లడించింది. గతంలో కశ్మీర్‌లో జరిగిన వివిధ ఉగ్రదాడులు, బాంబు పేలుళ్లలోనూ అతడి హస్తం ఉందని హోం శాఖ ఆరోపించింది.



Next Story

Most Viewed