అయోధ్య రామయ్యకు భారీగా బహుమతులు

by Disha Web Desk 16 |
అయోధ్య రామయ్యకు భారీగా బహుమతులు
X

లక్నో: అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న నవ్య భవ్య రామమందిరంలో కొలువుతీరనున్న రామయ్యకు దేశవిదేశాల నుంచి బహుమతులు వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అమ్మమ్మ- తాతయ్యల ఊరు చంద్‌ఖూరి, నేపాల్‌లోని అత్తమామల ఊరు జనక్‌పూర్‌ నుంచి ప్రత్యేక కానుకలు రామయ్యకు అందనున్నాయి. చంద్‌ఖూరి నుంచి దాదాపు 3వేల క్వింటాళ్ల బియ్యం.. జనక్‌పూర్‌ నుంచి పండ్లు, వస్త్రాలతో కూడిన 1100 ప్లేట్లను అయోధ్యకు పంపించనున్నారు. కానుకల లిస్టులో ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా నుంచి ‘అష్టధాతు’తో తయారు చేసిన 2100 కిలోల బరువున్న గంట, వడోదర నుంచి 108 అడుగుల పొడవున్న అగరబత్తీ, పాట్నాలోని మహావీర్ ట్రస్ట్ నుంచి రూ. 2 కోట్లతో పాటు రూ.5 లక్షల విలువైన బంగారు విల్లు, బాణం కూడా ఉన్నాయి.

Read More..

ఆ 84 సెకన్ల మధ్య అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట.. ముహూర్తం విశిష్టత ఇదే..!



Next Story

Most Viewed