లిక్కర్ స్కాం : బెయిల్ కోసం హైకోర్టుకు.. తీర్పుపై ఉత్కంఠ

by Disha Web Desk 4 |
లిక్కర్ స్కాం : బెయిల్ కోసం హైకోర్టుకు.. తీర్పుపై ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసిన పెర్నోడ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ జనరల్ మేనేజర్ బినయ్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. గత వారం ట్రయల్ కోర్టు బినయ్ బాబు బెయిల్ పటిషన్ ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు నిర్ణయంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బినయ్ బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈడీ వివరణ కోరింది.

ఈ కేసులో నిందితుల బెయిల్‌ను గత వారం సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి, శరత్ చంద్రారెడ్డితో పాటు బినయ్ బాబు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. నిందితులు మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు.

వీరిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అందువల్ల ఈ ఐదుగురు నిందితులు బెయిల్‌కు అర్హులు కాదు అంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగ్‌పాల్ వీరి బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బినయ్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఎలాంటి నిర్ణయం రాబోతోంది అనేది ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed