నితీశ్ వద్దే కీలక శాఖలు: బిహార్‌లో మంత్రులకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు

by Dishanational2 |
నితీశ్ వద్దే కీలక శాఖలు: బిహార్‌లో మంత్రులకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఇటీవల కొలువుదీరిన నూతన ప్రభుత్వంలో సీఎం నితీశ్ కుమార్ మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను నితీశ్ తనవద్దే ఉంచుకోగా..బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రుల్లో సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్య, క్రీడా శాఖలు.. అలాగే విజయ్ సిన్హాకు వ్యవసాయ రోడ్ల నిర్మాణం తదితర శాఖలు కేటాయించారు. మరో మంత్రి విజయ్ చౌదరికి జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాలు, భవన నిర్మాణం, రవాణా, విద్య, సమాచార పౌరసంబంధాల శాఖలు ఉన్నాయి. విజేంద్ర ప్రసాద్ యాదవ్‌ వద్ద ఇంధనం, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రొహిబిషన్, ప్రొడక్ట్ అండ్ మేనేజ్‌మెంట్, రిజిస్ట్రేషన్, మైనారిటీ సంక్షేమ శాఖలు ఉంటాయి. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజుల తర్వాత పోర్ట్ పోలియోలు కేటాయించారు.

20ఏళ్లుగా ఆ శాఖలు నితీశ్ వద్దే

సీఎం నితీశ్ కుమార్ 20ఏళ్లుగా హోం శాఖ, ఎన్నికలు, సాధారణ పరిపాలన శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా ఈ శాఖలన్నీ తన వద్దే ఉంచుకున్నారు. అలాగే 2020లో ఎన్‌డీయే ప్రభుత్వం ఏర్పడిన సమయంలో జేడీయూ వద్ద ఉన్న అన్ని శాఖలను తమ వద్దే ఉంచుకుంది. బీజేపీకి కూడా సరిగ్గా అదే ఫార్ములా వచ్చింది. 2020లో బీజేపీకి ఉన్న అన్ని శాఖలను నితీశ్ తిరిగి ఇచ్చేశారు. ఇక, హిందుస్థానీ ఆవామీ మోర్చాకు చెందిన సంతోష్ కుమార్ సుమన్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు ఇవ్వగా.. ఏకైక స్వతంత్ర మంత్రి సుమిత్ కుమార్ సింగ్‌కు సైన్స్, టెక్నాలజీ, సాంకేతిక విద్య కేటాయించారు. అయితే బిహార్ కేబినెట్‌లో ప్రస్తుతం సీఎంతో పాటు 8మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో 36 మంది వరకు ఉండే అవకాశం ఉంది.


Next Story

Most Viewed