కేరళలో గరిష్టానికి కరోనా కేసులు... ఒక్కరోజులో రికార్డు..

by Web Desk |
కేరళలో గరిష్టానికి కరోనా కేసులు... ఒక్కరోజులో రికార్డు..
X

తిరువనంతపురం: కేరళ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గురువారం ఒక్క రోజులో 46,387 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో వైరస్ బారిన పడి 32 మంది మరణించారు. ఇక పాజిటివిటీ రేటు ఏకంగా 40.2శాతానికి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. పరీక్షించిన ప్రతి 100 మంది 40 కి పైగా కరోనా బారిన పడుతున్నట్లు వెల్లడించారు. ఇక జిల్లాల వారిగా తిరువనంతపురంలో 46.68శాతం, ఎర్నాకులంలో 45.6 శాతం, కోజికోడ్‌లో 42శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.

గురువారం ఒక్క రోజులో 1,15,357 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇక దేశ వాణిజ్య రాజధాని లో కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 5,708 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారిన పడి 12 మంది చనిపోగా, 15,440 మంది కోలుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 12,306 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 43 మంది వైరస్ బారిన పడి మరణించారు. గత ఏడాది జూన్ తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం.


Next Story