కోర్టును వదిలి వెళ్లండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

by Disha Web Desk 13 |
కోర్టును వదిలి వెళ్లండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
X

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ విచారణ సమయంలో న్యాయవాది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పిటిషన్‌ను జాబితా చేయడంపై తీవ్రమైన వాగ్వాదంలో ఆయన సహానాన్ని కోల్పోయినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్‌పై సుప్రీంకోర్టు న్యాయవాదులకు భూమికి సంబంధించిన కేసులో ఆయన మండిపడినట్లు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వికాస్ సింగ్ న్యాయవాదులకు భూముల విషయమై పరిష్కారం చూపాలని పిటిషన్ విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఇలా డిమాండ్ చేయడం సరికాదని, తాము ఖాళీగా ఉండట్లేదని సీజేఐ అన్నారు.

అయితే తాను అలా అనట్లేదని, కేవలం పిటిషన్ జాబితా చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే తాను సీజేఐ హోదాలో ఉన్నానని, సాధారణ పిటిషన్ ను ఎక్కువ చేసి చూపొద్దని చంద్రచూడ్ అన్నారు. అంతేకాకుండా వికాస్ సింగ్ నుద్దేశించి గొంతు తగ్గించి మాట్లాడాలని కోరారు. ఇదే క్రమంలో వికాస్ మరోసారి స్పందించడంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. కోర్టును వదిలివేయాలని కోరినట్లు పేర్కొన్నాయి. మరోవైపు సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, ఎన్కే కౌల్ బార్ తరుఫున సీజేఐ ని క్షమాపణలు కోరినట్లు వెల్లడించాయి.



Next Story

Most Viewed