ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. తాజా నివేదికలు ఏం చెప్తున్నాయంటే..!

by Dishanational6 |
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. తాజా నివేదికలు ఏం చెప్తున్నాయంటే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఓ వైపు గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. మరోవైపు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం. ఇటీవలే సిరియా రాజధాని డమాస్కస్ లో ఇరాన్ రాయబార కార్యాలయంపై మిసైల్ దాడి జరిగింది. అందులో ఇద్దరు ఇరాన్ అధికారులు చనిపోయారు. ఆ దాడి చేసింది ఇజ్రాయెల్ అని భావించి.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది ఇరాన్. చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ పై ఇరాన్ ఎటాక్ చేసింది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకు పడింది. కానీ ఇజ్రాయెల్ కు ఎలాంటి నష్టం జరగలేదు. ఇకపోతే, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై దాడి చేసింది. ఇరాన్ రక్షణ వ్యవస్థే లక్ష్యంగా దాడులు చేపట్టింది. కానీ ఇరాన్ కు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం స్పందించలేదు. కానీ, ఈ దాడులపై అమెరికా వార్తసంస్థల రిపోర్టులు మాత్రం షాకింగ్ విషయాలను బయటపెట్టాయి.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది నిజమేనని అమెరికా వార్తా సంస్థలు తేల్చిచెప్పారు. దాడి జరిగిన ప్రాంతంలో శాటిలైట్ ఇమేజ్‌లని పరిశీలించగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇస్ఫహాన్‌పై డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించినట్లుగా స్ప,టం చేసింది. శాటిలైట్ ఫొటోలు.. ఇస్ఫహాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈశాన్యంగా ‘S-300 సర్ఫేస్-ఎయిర్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు చెందిన బ్యాటరీ ఉన్నట్టుగా చూపించాయి. అలాగే.. ఏప్రిల్ 15న రహస్య ప్రాంతంలో ఉంచిన S-300 రక్షణ వ్యవస్థ శాటిలైట్ ఫోటోలో కనిపించింది. కానీ.. తాజా ‘గూగుల్ ఎర్త్ ఫొటో’ మాత్రం S-300 క్షిపణి రక్షణ వ్యవస్థ జాడ లేదు. కేవలం ఖాళీ స్థలాన్ని చూపించింది.

అయితే.. ఇరాన్‌కు చెందిన ఇద్దరు అధికారులు మాత్రం ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. డ్రోన్లు, క్షిపణులు, విమానాలు.. ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించినట్టు ఇరాన్ సైన్యం గుర్తించలేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇరాన్ మీడియా ఏజెన్సీ సైతం ఒప్పుకుంది. ఎలాంటి దాడులు జరగలేదని.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయలేదని తెల్పింది. కానీ.. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ విశ్లేశించిన శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. రక్షణ వ్యవస్థలు సైతం గుర్తించకుండా తాము దాడి చేయగలమని ఇరాన్‌కి సందేశం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ఈ దాడి జరిపినట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఇకపోతే, ఏళ్లతరబడి చర్చల తర్వాత 2016లో S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇరాన్‌కు పంపిణీ చేసింది రష్యా. ఇరాన్ కు ఈ S- 300 రక్షణే వ్యవస్థలను రష్యా సరఫరా చేయడంతో.. ఇజ్రాయెల్‌లో ఆందోళనలకు దారితీసింది. దీంతో, 2010లో పశ్చిమ దేశాల ఒత్తిడితో రష్యా-ఇరాన్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.



Next Story

Most Viewed