గంగా నదిలో పతకాలు వేయాలనుకున్న విషయంలో రెజ్లర్స్ కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
గంగా నదిలో పతకాలు వేయాలనుకున్న విషయంలో రెజ్లర్స్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: గంగానదిలో తమ పథకాలు పడవేయాలనుకున్న విషయంలో భారత మహిళ రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నదిలో పతకాలు పడవేయాలనుకున్న నిర్ణయాన్ని మహిళ రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. రైతు నేతల విజ్ఞప్తి మేరకు తాత్కలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు రెజ్లర్లు తెలిపారు. హరిద్వార్‌లో రెజ్లర్లతో రైతుల సంఘాల నేత రాకేష్ టికాయత్ చర్చలు జరిపారు.

అనంతరం రెజ్లర్స్ వారి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వానికి రెజ్లర్లు ఐదు రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐదు రోజుల్లోగా బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రెజ్లర్లు డిమాండ్ చేశారు.

ఇక, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ భారత మహిళ రెజర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత ఫోగట్‌తో పాటు మరికొందరు రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజులకు పైగా రెజ్లర్లు రోడ్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు వారి పతకాలను గంగా నదిలో వేయాలని నిర్ణయించుకున్నారు.

Next Story

Most Viewed