2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

by Disha Web Desk 12 |
2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన ఆసియా క్రెడిట్ ఔట్‌లుక్ 2023 ప్రకారం.. భారత్ రానున్న ఏడు సంవత్సరాల్లో అంటే 2030 నాటికి ప్రపంచలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొంది. దీనికి కారణంగా గ్లోబల్ గ్రోత్ స్తబ్దతను చూపింది. భారత్ అనేక రంగాల్లో ఉత్తమంగా ఫలితాలు సాధిస్తూ.. ముందుకు సాగుతుందని.. గడిచిన 13 సంవత్సరాల్లో భారత్ అత్యంత బలమైన రేట్లలో ఒకటిగా విస్తరించి, ఆర్థిక స్థితిస్థాపకతకు దారితీసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా ప్రకారం కొనసాగితే, 2030 నాటికి భారతదేశం జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుతం, భారతదేశం 2023-24 లో USD 3.7 ట్రిలియన్ల విలువైన GDPతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది.


Next Story