భారత్ నిరంతరం ఎంతో శ్రమిస్తోంది: ప్రధాని నరేంద్ర మోడీ

by Dishanational2 |
భారత్ నిరంతరం ఎంతో శ్రమిస్తోంది: ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ ప్రస్తుతం చిన్న చిన్న విషయాల గురించి కలలు కనడం మానేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటిని నెరవేర్చుకునేందుకు ప్రతి నిత్యం ఎంత గానో శ్రమిస్తుందని తెలిపారు. సోమవారం ఆయన అమృత్ భారత్ పథకం కింద సుమారు రూ. 41,000 కోట్ల విలువైన 2,000 కంటే ఎక్కువ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. పదేళ్లలో బీజేపీ నూతన భారత్ ను ప్రారంభించిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దోచుకోవడం ఆగిపోయిందని కొనియాడారు. సంపాదించిన ప్రతి పైసా అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నామని చెప్పారు. భారతీయ రైల్వేలు ఒకప్పుడు రాజకీయాల బాధితురాలిగా ఉండేవని, ప్రస్తుతం ప్రయాణ సౌలభ్యానికి అనుగుణంగా ఉన్నాయన్నారు. అంతేగాక ఇది పెద్ద ఉపాధి వనరుగా కూడా మారిందని కొనియాడారు.

జూన్ నుంచి మూడో టర్మ్ ప్రారంభం

జూన్ నుంచి బీజేపీ ప్రభుత్వ మూడో టర్మ్ ప్రారంభమవుతుందని మోడీ దీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆశ్చర్యపోయేలా మూడో దశ పరిపాలన ఉంటుందని చెప్పారు. పునరుద్ధరించబడిన రైల్వే స్టేషన్లు స్థానిక సంస్కృతి మరియు కళాకారులను ప్రోత్సహించడానికి ఉపయోగించబడుతున్నాయని తెలిపారు. యువత కలలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.కాగా, మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో పునరుద్దరించాల్సిన రైల్వే స్టేషన్లు 553 ఉన్నాయి. 2023 ఆగస్టు 6న మోడీ అమృత్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దేశ వ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించమే లక్ష్యంగా పెట్టుకున్నారు.



Next Story

Most Viewed