భారత్ నాలో భాగం.. ఎక్కడికెళ్లినా వెంటే తీసుకెళ్తా: Google CEO సుందర్ పిచాయ్

by Satheesh |
భారత్ నాలో భాగం.. ఎక్కడికెళ్లినా వెంటే తీసుకెళ్తా: Google CEO సుందర్ పిచాయ్
X

న్యూఢిల్లీ: గూగుల్-ఆల్ఫాబెట్ కంపెనీల సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వం అందించే మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ స్వీకరించారు. శనివారం భారత అంబాసిడర్ తరంజిత్ సింగ్ సంధు శానిప్రాన్సిస్కోలో సుందర్‌కు ఈ అవార్డును అందజేశారు. ఆయన స్ఫూర్తి‌దాయక ప్రయాణం ప్రపంచ ఆవిష్కరణలకు భారతీయ ప్రతిభావంతుల సహకారాన్ని పునరుద్ఘాటిస్తుందని చెప్పారు. దీనిపై సుందర్ పిచాయ్ స్పందించారు. కుటుంబ సమక్షంలో పద్మభూషణ్ అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందని ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నాలో భాగమని.. ఎక్కడికెళ్లినా తన వెంటే తీసుకెళ్తానని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వాణిజ్య, పరిశ్రమల విభాగంలో సుందర్ పిచాయ్‌కు భారత ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

Next Story

Most Viewed