ఐరాసలో పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత ప్రతినిధి కౌంటర్..

by Disha Web Desk 13 |
ఐరాసలో పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత ప్రతినిధి కౌంటర్..
X

న్యూఢిల్లీ: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి 'దురుద్దేశ పూరితమైన, తప్పుడు ప్రచారాలకు' స్పందించడం కూడా అనవసరమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి లో పాక్ మాట్లాడుతూ.. కశ్మీర్ లో మహిళ, శాంతి, భద్రత అనే అంశంపై చర్చకు లేవనెత్తారు. భుట్టో వ్యాఖ్యలను భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ కొట్టి పారేశారు. ఇవన్నీ ఆధార రహిత, రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు.

‘దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో మా దృష్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ముందుకు ఉంటుంది. మహిళలు, శాంతి, భద్రత ఎజెండా పూర్తి అమలును వేగవంతం చేయడానికి మా సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తాం. మేము చర్చ అంశాన్ని గౌరవిస్తాము. సమయానికి ప్రాధాన్యతనిస్తాం’ అని ఆమె తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పాకిస్తాన్ ప్రపంచ వేదికలపై భారత్ విషయాలను ప్రస్తావించగా.. ధీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed