180కి పైగా దేశాలకు మెడిసిన్ అందించాం

by Disha Web Desk 10 |
180కి పైగా దేశాలకు మెడిసిన్ అందించాం
X

న్యూఢిల్లీ: కరోనా విపత్తు సమయంలో భారత్ 180కి పైగా దేశాలకు మెడిసిన్ అందించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయా అన్నారు. వసుదైవ కుటుంబం అనేది భారతదేశ వారసత్వమని, విపత్తు సమయంలో భారత్ తన బాధ్యతను నెరవేర్చిందని చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిర్వహించిన వాకథాన్ లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. అనేక దేశాలు మెడిసిన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో భారత్ అండగా నిలిచిందన్నారు. దీంతో పాటు వ్యాక్సిన్లు కూడా సరఫరా చేసిందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో మెడికల్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed